Karthika Deepam Concept : కార్తీకదీపం కాన్సెప్ట్ తో ఇలియానా సినిమా

'కార్తీకదీపం' (Karthika deepam) సిరీయల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న ఈ సీరియల్.. కొన్నేళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. ముఖ్యంగా వంటలక్క క్యారెక్టర్ ఎంతగానో ఆకట్టుకుంది. కాస్త నలుపు రంగులో ఉండే ఈమె పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాదాపు ఇదే కాన్సెప్ట్ ఓ హిందీ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో హీరోయిన్ గా ఇలియానా (Illeana) నటించింది. 'తేరా క్యా హోగా లవ్లీ' (Tera kya hoga lovely) అనే టైటిల్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సేమ్ 'కార్తీకదీపం' సీరియల్లో ఉన్నట్లే ఇందులోనూ హీరోయిన్ నలుపు రంగులో ఉంటుంది. కాకపోతే అక్కడ డాక్టర్ బాబు ఉంటే ఇక్కడ పోలీస్ బాబు ఉన్నాడు. హీరోయిన్ ఇలియానా నలుపు రంగులో ఉంటుంది. దీంతో ఎవరూ ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లందరూ నో చెప్పేసి వెళ్లిపోతుంటారు.
ఈమె పెళ్లి చేస్తే ఇవ్వడానికని ఉంచిన సామాన్లు కూడా దొంగతనానికి గురవుతాయి. దీంతో దర్యాప్తు కోసం ఓ పోలీస్ వస్తాడు. హీరోయిన్ ప్రేమలో పడతాడు. ఇలా ఈ సినిమా కథ సాగుతుందని ట్రైలర్ ఆధారంగా తెలుస్తోంది. ఇందులో అందం, వరకట్న లాంటి సామాజిక విషయాల్ని ప్రస్తావించారు. వీటిని కాస్త సున్నితమైన హాస్యంతో చెప్పేందుకు ప్రయత్నించారు. మరి ఈ సినిమాతో ఇలియానా హిట్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com