Interesting Facts : ఓపెన్ హైమర్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హైమర్ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది.
ఫాదర్ ఆఫ్ ఆటం బాంబ్ జే రాబర్ట్ ఓపెన్హైమర్ జీవితం ఆధారంగా ఓపెన్ హైమర్ ను తెరకెక్కించారు. దీన్ని ‘ది ట్రయంఫ్ అండ్ ట్రాజెడీ ఆఫ్ జె రాబర్ట్ ఓపెన్ హైమర్' అనే పుస్తకం ఆధారంగా రూపొందించారు. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. గతేడాది జులై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. వంద మిలియన్ డాలర్లతో రూపొంది.. సుమారు వెయ్యి మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
ఇందులోని న్యూక్లియర్ పేలుడు దృశ్యాలతో కూడిన క్లైమాక్స్ ను కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ వినియోగించకుండా ఒరిజినల్ గానే రీక్రియేట్ చేశారు. ఈ సినిమా ఏకంగా మూడు గంటల నిడివి ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత అప్డేటెడ్ వర్షన్ కెమెరాలను ఈ సినిమా చిత్రీకరణకు వాడారు.
జే రాబర్ట్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ది మ్యాన్ హట్టన్ పేరుతో ఆటం బాంబ్ తయారీ ప్రాజెక్ట్ ని చేపట్టారు. ఆ ఆటం బాంబు జపాన్ పై ప్రయోగించారు. జే రాబర్ట్ పాత్రలో సిలిన్ మర్ఫీ నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com