Tyson Nayudu Movie : టైసన్ నాయుడుతో బెల్లంకొండ సాయి పవర్ చూపుతాడా..?

బాలీవుడ్ లో అనూహ్యంగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు తెలుగు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సాయి శ్రీనివాస్..సినిమా ఆవరేజ్ టాక్ సాధించినప్పటికీ నటుడుగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఐతే.. ఆ తర్వాత సక్సెస్ మాత్రం పెద్దగా సాధించలేదు. కష్టపడతాడు.. డ్యాన్సులు, పైట్స్ బాగా చేస్తాడన్న పేరైతే ఉంది.
శీను ప్రస్తుతం సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో 'టైసన్ నాయుడు' అనే సినిమా చేస్తున్నాడు. సాగర్ కె చంద్ర ఇంతకుముందు పవన్ కళ్యాణ్, రానాలను పెట్టి భీమ్లా నాయక్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. భీమ్లా తర్వాత బెల్లంకొండ సాయితో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని తీస్తున్నాడు సాగర్ చంద్ర.
టైసన్ నాయుడు టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈసారి కచ్చితంగా సక్సెస్ కొడతాడన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com