Spirit Movie : స్పిరిట్ లో దీపిక ఉన్నట్లా? లేనట్లా?

యానిమల్ సినిమా భారీ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా తన తదపురి కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పిరిట్ ' కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇక డార్లింగ్ హీరో సరసన ఇందులో దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రభాస్, దీపికా జంటగా వచ్చిన కల్కి సినిమా సక్సెస్ అయి భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో తాజాగా ఈ సినిమాలోనూ ఆమెను ఎంపిక చేసేందుకు ఆమెతో సంప్రదింపులు జరిపారు. దీంతో వారిద్దరు జోడిగా మరో చిత్రం రాబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆమెను ఈ సినిమాలో హీరోయిన్గా పక్కన బెట్టారనే టాక్ జోరుగా నడుస్తోంది. తన పాత్ర కోసం దీపిక అత్యధిక పారి తోషికం డిమాండ్ చేయడమే కారణమని తెలుస్తోంది. స్పిరిట్ లో నటన కోసం ఆమె ఏకంగా రూ.20కో టు డిమాండ్ చేసిందట. దీంతో ఈ సినిమాలో దీపికా పదుకొనే నటి స్తున్నట్లా? లేక ఆమెను పక్కనబెట్టినట్లా అనే చర్చ జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియా లంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com