Sai Pallavi : విజయ్ దేవరకొండ సరసన సాయిపల్లవి?

Sai Pallavi : విజయ్ దేవరకొండ సరసన సాయిపల్లవి?

విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న ‘SVC59’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. రవికిరణ్ కోలా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. కాగా ఈ మూవీలో నటించే నటీనటులు, మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. దిల్‌ రాజు నిర్మాణంలో రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. గ్రామీణ నేపథ్యంలో యాక్షన్‌ కథాంశమిది. ఇటీవల విజయ్‌ దేవరకొండ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ప్రచార చిత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో సాయిపల్లవిని కథానాయికగా ఎంపిక చేశారని సమాచారం.

కథలోని కొత్తదనంతో పాటు తన పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించడంతో ఆమె ఈ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి ‘తండేల్‌’తో పాటు హిందీలో ‘రామాయణ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags

Next Story