Prabhas Movie : ప్రభాస్ సినిమా కోసం అంత రెమ్యూనరేషనా?

Prabhas Movie : ప్రభాస్ సినిమా కోసం అంత రెమ్యూనరేషనా?
X

బాలీవుడ్ లో దూసుకుపోతున్న నటీమణి దీపికా పదుకొణె. ప్రభాస్, దీపికా కలిసి నటించిన కల్కి 2898 ఏడీ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో స్పిరిట్ అనే మూవీ రాబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ గురించి ఓ రేంజ్లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనుండటంతో ఏ రేంజ్లో సినిమా ఉండబోతుందా అని అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘యానిమల్' మూవీ లోసందీప్ డైరెక్షన్ కి వందకి వంద మార్కులు పడ్డాయి. రణ్ బీర్ చూపించిన విధానం కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అలాంటి ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడనే చర్చయితే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఏక్షణమైనా ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్, అలియాభట్, రష్మిక మందన్నతో పాటు పలువురు పేర్లు వినిపించినా ఎవరినీ ఖరారు చేయలేదు. తాజాగా దీపికా పడుకొణే పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె రూ.20కోట్ల భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందని, మేకర్స్ కూడా అంతమొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Next Story