Jabardasth Comedian : దీనస్థితిలో జబర్దస్త్ వినోద్.. కారణాలు ఇవే

జబర్దస్త్ షో (Jabardath Show) ఎంతోమందిని స్టార్లను చేసింది. ఆర్థికపరంగా ఎంతోమందిని నిలబెట్టింది. ఐతే.. సొంత ట్యాలెంట్ తో... వచ్చిన పాపులారిటీని మరింతగా పెంచుకుంటున్నది కొందరు. పాపులారిటీని వినియోగించుకోలేని స్థితిలో మరికొందరు ఉండిపోయారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. కంటెంట్ తో నవ్వించి స్టార్లుగా మారిన వారు ఎందరో అలాంటి వారిలో ఒకడే జబర్దస్త్ వినోద్.
జబర్దస్త్ లో టీం మెంబర్ గా అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ వినోధిని.. అలియాస్ వినోద్ పాపులర్. వినోద్ ఆడపిల్ల గెటప్ లో తన అందం, కామెడీ టైమింగ్ తో ఎంతోమందిని నవ్వించాడు. గత కొంతకాలంగా జబర్దస్త్ కు దూరమైపోయాడు. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ జబర్దస్త్ మానేసినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
రెండేళ్ల క్రితం నుంచి జబర్దస్త్ వినోద్ ఈ ఇన్ఫెక్షన్ తో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడట. ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఈ వ్యాధి ఉన్నట్టు చాలా ఆలస్యంగా తెలిసిందని వివరించాడు. దీంతో చాలా బరువు తగ్గిపోయానని.. క్రమంగా వెయిట్ లాస్ అయ్యానని.. అయితే దానిని పెద్దగా పట్టించుకోకుండా నెగ్లెట్ చేశానని.. నెలలోనే ఒక్కసారి తగ్గిపోవడంతో టెస్టులు చేయించుకుంటే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని బయటపడింది అంటూ వివరించాడు. సమయానికి తినకపోవడం.. బయటి ఫుడ్ ఎక్కువగా తినడమే తన అనారోగ్యానికి కారణమని అంటున్నాడు వినోద్. స్నేహితులు కలిసినా గుర్తుపట్టలేనంతగా దీనంగా మారిపోయాడు ఈ పాపులర్ ఆర్టిస్ట్. కోలుకుని మళ్లీ మరిన్ని అవకాశాలు అందుకోవాలని మనం ఆశిద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com