Bigg Boss Beauty : బిగ్ బాస్ ఫిగర్‌కు జాక్ పాట్!

Bigg Boss Beauty : బిగ్ బాస్ ఫిగర్‌కు జాక్ పాట్!

తెలుగు బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ రతికా రోజ్. ఆమెకు సూపర్ ఆఫర్ దక్కిందని ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న రతికా.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ తో లింక్ లతో అప్పట్లో బాగా వార్తల్లో నిలించింది.

రీసెంట్ గా పలు సినిమాలలో కూడా ఛాన్సెస్ కొట్టేసింది రతిక. కేవలం హీరోయిన్ గానే కాదు కీలకపాత్రలో నటించడానికి ఒప్పుకుంటోంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో చాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తోంది. తెలుగు యూత్ ఆడియన్స్ పైనా ఫోకస్ చేసిన మేకర్స్.. రతికా రోజ్ తో విజయ్ దళపతి మూవీలో ఓ కీలక పాత్ర ఇచ్చారని సమాచారం. తెలుగు అందాలకు తమిళనాడులో మంచి గిరాకీ ఉంటుంది. దీంతో.. ఎవరీ కొత్తందం అంటూ ఇంటర్నెట్ జల్లెడ పడుతున్నారు తమిళ తంబీలు.

బ్యాక్ గ్రౌండ్ లేని రతిక అంత పెద్ద స్టార్ హీరోతో ఆఫర్ అందుకోవడంతో ఇండస్ట్రీ సర్ ప్రైజ్ అవుతోంది. హీరోయిన్ గా కాకపోయినా.. పెద్ద హీరో సినిమాల్లో కనిపిస్తే ఎక్కువమంది కళ్లలో పడొచ్చు. ఆ తర్వాత ఆఫర్లు పొందొచ్చు అనేది చాలామంది అప్ కమింగ్,టాలెంటెడ్ హీరోయిన్ల అభిప్రాయం.

Tags

Read MoreRead Less
Next Story