Janhvi Kapoor : వరుస ఆఫర్లు.. రెమ్యునరేషన్ పెంచేసిన జాన్వీ కపూర్

Janhvi Kapoor : వరుస ఆఫర్లు.. రెమ్యునరేషన్ పెంచేసిన జాన్వీ కపూర్

శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తల్లికి తగ్గట్టుగానే అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. సౌత్ లోకి కూడా అడుగుపెట్టిన ఈ అమ్మడు.. దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఎన్ టీఆర్ సరసన నటించనుంది. మరోపక్క రామ్ చరణ్ తోనూ జతకట్టేందుకు సిద్ధమైంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో చరణ్ హీరోగా చేస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ జాన్వీ

అందుకుంటుందని టాక్. బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్న జాన్వీ కపూర్ .. దేవర కోసం 6 కోట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇక ఇప్పుడు చరణ్ సినిమా కోసం మరో రూ.2 కోట్లు పెంచి.. మొత్తం 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ గా అందుకుంటుందని సమాచారం. జాన్వీ కపూర్ సినిమాలో ఉంటే బాలీవుడ్ లో కూడా మార్కెట్ పెరుగుతుందనే అభిప్రాయంతో మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారట. ప్రస్తుతం జాన్వీ కపూర్ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags

Next Story