Janhvi Kapoor : సూపర్ స్టార్ కి జోడిగా జాన్వీ కపూర్!

Janhvi Kapoor : సూపర్ స్టార్ కి జోడిగా జాన్వీ కపూర్!

అతిలోకి సుందరి శ్రీదేవి నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చింది బాలీవుడ్ సుందరి జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. అనంతరం పలు సినిమాల్లో నటించి మెప్పించి.. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది. ఇక టాలీవుడ్ లోకి కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తో దేవర సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు జాన్వీ పరిచయం కాబోతుంది.

దీంతో పాటు రామ్ చరణ్ ఆర్ సీ16లోనూ ఈమెను హీరోయిన్ గా ఎంపికైంది. కాగా ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు హీరోగా రాజమౌళి డెరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు రాజమౌళి. ఈ మూవీలో మహేశ్ సరసన జాన్వీ నటించబోతుందట.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ మారింది. అయితే మూవీ టీం నుంచి మాత్రం అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపు కుంటోంది. త్వరలోనే సెట్స్పికి వెళ్లనుంది.

Tags

Next Story