Janhvi Kapoor : అలాంటి వాడినే పెళ్లాడుతా: జాన్వీకపూర్

తన కలలను అతడి కలలుగా భావించేవాడినే పెళ్లి చేసుకుంటానని స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలిపారు. మిస్టర్ అండ్ మిసెస్ మాహీ సినిమా ప్రమోషన్లో జాన్వీ తన మనసులో మాట బయటపెట్టారు. ‘నాకు ఎల్లప్పుడూ సంతోషాన్నిచ్చేవాడు. నన్ను ఎప్పుడూ నవ్విస్తుండేవాడు. నేను బాధలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు. అన్ని విషయాల్లో నాకు అండగా నిలిచేవాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తే నాకు కావాలి’ అని ఆమె చెప్పారు.
తనకు కాబోయే వాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి జాన్వీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే జాన్వీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తోంది. ఆ మధ్య అంబానీల ప్రీవెడ్డింగ్ కు కూడా అతనితో కలిసి వెళ్లింది. తన మెడలో వేసుకున్న చెయిన్ లో శిఖర్ పేరున్న లాకెట్ ధరించింది.
ఇక ప్రస్తుతం జాన్వీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16లోనూ రామ్ చరణ్ సరసన జాన్వీయే ఫిమేల్ లీడ్ గా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com