Pushpa 2 : పుష్ప 2 జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ !

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి మెప్పించిన రష్మిక.. ఏకంగా నేషనల్ క్రష్ గా మారిపోయింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ పుష్ప మూవీకే హైలెట్ గా నిలిచింది. ఊ అంటావా ఉహూ అంటావా అంటూ సాగే ఈ పాట సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా కూడా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇందులో కూడా ఓ స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోవాలని డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) ప్లాన్ చేస్తున్నాడు. ఊ అంటావా ఉహూ అంటావాని మించేలా దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటని కంపోజ్ చేసినట్టు టాక్. ఈ పాటలో నటించాలని శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను సుకుమార్ సంప్రదించాడట. అయితే ఈ ప్రతిపాదనకు జాన్వీ ఒప్పుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాబట్టి పుష్ప సినిమా ఫెయిల్ అయిన ఆమె కెరీర్ పై పెద్దగా ప్రభావం ఉండేది కాదు.
కానీ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్వీ (Janhvi kapoor) మొదట్లోనే ఇలా స్పెషల్ సాంగ్ చేయడం కొంచెం రిస్క్ తో కూడుకున్న విషయమని సినీ వర్గాల నుంచి టాక్ వస్తోంది. మరి జాన్వీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా టాలీవుడ్ లోకి దేవర సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తరువాత సినిమాలో కూడా ఈ బ్యూటీ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై క్లారిటీ లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com