Kajal Aggawral : ఇప్పటికీ ఆ లెటర్ ను దాచి పెట్టా : కాజల్ అగర్వాల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో సత్యభామ సినిమా చేసింది కాజల్. శశి కిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
తాను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ అయ్యిందని తెలిపింది. తెలుగు నేర్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానంటోందీ అమ్మడు. మొదటి సినిమా హిందీలో చేసినా సరే తొలి సినిమా రిలీజైంది మాత్రం తెలుగులోనే (లక్ష్మీ కల్యాణం) అని చెప్పుకొచ్చింది. తన మ్యారేజ్ గురించి ప్రస్తావిస్తూ.. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పింది.
తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడ సంప్రదాయాల మీద గౌరవం పెరిగిందని, అందుకే తన పెళ్లిలో కూడా మన సంప్రదాయం పాటించామని అన్నారు. కాలేజీ రోజుల్లో తనకు ఎంతోమంది లవ్ లెటర్స్ రాసేవారని చెప్పుకొచ్చిన కాజల్. ఒక అబ్బాయి రాసిన లవ్ లెటర్ బాగా నచ్చింది. తన తల్లికి కూడా ఆ లెటర్ నచ్చిందట. తన మీద అతను రాసిన కవిత బాగుండటంతో ఇప్పటికీ ఆ లెటర్ ను దాచి పెట్టానని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com