Kannappa Update : కన్నప్పలో కాజల్ .. పాత్ర ఇదే!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కాజల్.. పార్వతి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ పాత్రలో నయనతార నటించాల్సి ఉంది. కానీ ఏ కారణాలవల్లో ఆమె అర్ధంతరంగా సినిమా నుంచి తప్పుకున్నారు. నిజానికి నిడివి పరంగా చూస్తే, చాలా తక్కువ నిడివి కలిగిన పాత్రనే ఇది. అందువలన నయన్ .. అనుష్క చేయనంటే కాజల్ ను తీసుకున్నారా? అనేది ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారట. ఈ సినిమాలో మంచు వారసుడు, విష్ణు తనయుడి గ్రాండ్ ఎంట్రీ కూడా ఉండబోతుంది. కన్నప్పులో చిన్ననాటి విష్ణు పాత్రను అతడి తనయుడు అవ్రామ్ పోషిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ అంతా భాగం అవుతున్నట్టు ఇప్పటికే విష్ణు చెప్పిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. రీసెంట్‌గా మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా వదిలారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో విష్ణు జలపాతం నుంచి ఎంట్రీ ఇస్తూ.. బాణంను ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com