Kajal Aggarwal : తెలుగు సంప్రదాయం చాలా ఇష్టం: కాజల్

తెలుగు భాష, సంప్రదాయం తనకు చాలా ఇష్టమని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో పుట్టకపోయినా పెళ్లి కూడా అందుకే తెలుగు పద్ధతిలో చేసుకున్నట్లు పేర్కొన్నారు. ‘నాకు మన సినిమాల్లో చాలా నకిలీ పెళ్లిళ్లు చేసేశారు. దీంతో నిజం పెళ్లి కూడా మన తెలుగు స్టైల్లోనే చేసుకున్నా. ముంబైలో పుట్టినా తెలుగు ఇష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడు నాకు అది సెకండ్ లాంగ్వేజ్’ అని తెలిపారు.
కాజల్ హీరోయిన్ గా తన జోరు కొనసాగుతున్న సమయంలోనే 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తో కలిసి 'నేను పక్కా లోకల్' అనే స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఆ సాంగ్ అటు యూత్ ను .. ఇటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చాలా ఫంక్షన్స్ లో ఆ పాట వినిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ .. "ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడం వలన నేను ఆ సాంగ్ చేశానని చాలామంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ఎన్టీఆర్ గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో కలిసి సినిమాలు చేశాను. ఆయన వల్లనే ఆ పాట చేయడానికి ఒప్పుకున్నాను" అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com