Kajal Satyabama : మే 17న కాజల్ సత్యభామ వచ్చేస్తోంది

Kajal Satyabama : మే 17న కాజల్ సత్యభామ వచ్చేస్తోంది

పెళ్లి తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కాజల్ అగర్వాల్.. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు కమర్షియల్ మూవీ కూడా చేస్తుంది. కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చెలరేగిపోతోంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. సెకండ్ ఇన్నింగ్స్ జోరు చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన 'సత్యభామ మూవీ'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా మూవీ టీమ్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. దానితో పాటే టీజర్ కూడా రిలీజైంది. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'సత్యభామ' సినిమాలో కాజల్ అగర్వాల్ గతం కన్నా భిన్నంగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు విడుదలైన టీజర్లో తుపాకీతో సందడి చేసింది. 'సత్యభామ' సినిమా విడుదల తేదీని టీజర్ ద్వారా వెల్లడించారు. ఈ ఈ సినిమా మే 17న విడుదల కానుంది. కాజల్ని 'క్వీన్ ఆఫ్ మాస్' అని రాసుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story