Kalki-2 : కల్కి-2 రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్

Kalki-2 : కల్కి-2 రిలీజ్ అయ్యేది అప్పుడే: అశ్వనీదత్
X

‘కల్కి-2’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తామని నిర్మాత అశ్వనీదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్, కమల్ ముగ్గురే ఎక్కువగా కనిపిస్తారని చెప్పారు. దీపిక పాత్రకూ ఇంపార్టెన్స్ ఉంటుందన్నారు. అవసరమైతేనే కొత్త పాత్రలను పరిచయం చేస్తామన్నారు. నాగ్ అశ్విన్ ఆలోచించే తీరు, దర్శకత్వ విధానం గొప్పగా ఉంటాయని ప్రశంసించారు.

‘కల్కీ-2 వచ్చే ఏడాది విడుదల అవుతుంది. సెకండ్ పార్ట్‌లో మొత్తం కమల్ హాసనే ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Tags

Next Story