Kalki 2898 AD : ఆ రెండు సినిమాలపై కల్కి ఎఫెక్ట్!

Kalki 2898 AD : ఆ రెండు సినిమాలపై కల్కి ఎఫెక్ట్!
X

కల్కి 2898ఏడీ మూవీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే వాటికి పోటీగా గాని, వారం రోజులు ముందుగా చిన్న సినిమాలు రిలీజ్ అయితే అస్సలు నిలబడవు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. స్టార్ హీరోల సినిమాలకే ప్రయార్టీ ఉంటుంది. గతంలో సలార్ మూవీ రిలీజ్ టైంలోనే షారుఖ్ ఖాన్ డంకీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే సలార్ వేవ్ ముందు డంకీ నిలబడలేకపోయింది. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఉన్న కూడా ప్రేక్షకులు ఫస్ట్ ప్రయారిటీ డార్లింగ్ ప్రభాస్ సలార్ కి ఇచ్చారు. ఇప్పుడు కల్కి 2898ఏడీ మూవీ కారణంగా రెండు చిన్న సినిమాలు దెబ్బ తిన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వాటిలో ఒకటి విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన మహారాజ మూవీ. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వారం రోజులు బాగానే కలెక్షన్స్ అందుకుంది. ప్రేక్షకాదరణ పెరగడంతో కచ్చితంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందనే అంచనాలుండేవి. కల్కి రిలీజ్ తర్వాత మహారాజ కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. కేవలం 85 కోట్లకే పరిమితమైంది. కల్కి సినిమాకి తమిళంలో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హిందీలో చిన్న సినిమాగా వచ్చి అందరిని ఆకట్టుకుంటున్న హర్రర్ కామెడీ చిత్రం ముంజియా. ఈ సినిమా ఆరంభంలో మంచి వసూళ్లని అందుకుంది. కల్కి రిలీజ్ తర్వాత కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. 100 కోట్లు పక్కా అనుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 93 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది.

Tags

Next Story