Kalki 2898 AD Collections : 1000 కోట కబ్లో కల్కి 2898 ఏడీ

Kalki 2898 AD Collections : 1000 కోట కబ్లో కల్కి 2898 ఏడీ
X

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి 2898 ఏడీ వెయ్యికోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో డార్లింగ్ అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన రెండు వారాల్లోనే కల్కి సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు వరల్డ్ వైడ్ గానూ కల్కి సినిమాకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ప్రస్తుతం బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రభాస్ సినిమా దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. ఎక్కడ చూసినా కల్కి థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. దీంతో చిత్ర బృందం ఫుల్ హ్యాపీగా ఉంది. కల్కి మూవీ సక్సెస్ వేడుకను చిత్రబృంద సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Tags

Next Story