Bimbisara-2 : థ్రిల్లర్‌గా వస్తున్న కళ్యాణ్ రామ్ బింబిసార 2

డైనమిక్ హీరో ప్రొడ్యూసర్ నందమూరి కల్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram ) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ బింబిసార. దీనికి పార్ట్ 2 ఉంటుందని మేకర్స్, యూనిట్ ఆనాడే ప్రకటించింది. మరి అప్పుడు ప్రకటించిన ఆ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే వార్త వచ్చేసింది.
బింబిసార ప్రీక్వెలని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. క్రియేటివ్ కాన్సెప్ట్ పోస్టర్ తో ఈ విషయాన్ని వెల్లడించారు. బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్ ను చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ ఫ్రీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. బింబిసార సినిమాలో కల్యాణ్ రామ్ బింబిసారగా కనిపించారు. ప్రీక్వెల్లో అంతకు మించిన అద్భుతమైన కథను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
స్క్రీన్ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించదానికి సన్నాహాలు జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. 'రొమాంటిక్' సినిమాను తెరకెక్కించిన అనిల్ పాదూరి బింబిసార2కి దర్శకత్వం వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com