Kalyan Ram : మెరుపు లా వస్తోన్న కళ్యాణ్ రామ్?

Kalyan Ram : మెరుపు లా వస్తోన్న కళ్యాణ్ రామ్?
X

నందమూరి కళ్యాణ్ రామ్ ( Kalyan Ram ), ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ‘మెరుపు’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. కాగా ఈ సినిమాలో విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ విజయశాంతి ఇందులో నటిస్తున్నారు. ఇందులో ఆమె వైజయంతీ ఐపీఎస్‌గా పోలీస్‌ అధికారి పాత్ర పోషిస్తుండటం విశేషం. భారీ విరామం తర్వాత విజయశాంతిని మళ్లీ పోలీస్‌ డ్రెస్‌లో చూడబోతున్నామన్నమాట. కల్యాణ్‌రామ్‌ పాత్ర కూడా ఇందులో పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నదట. కార్పొరేట్‌ లుక్‌తో స్టెల్‌గా ఆయన ఇందులో కనిపించనున్నారని మేకర్స్‌ చెబుతున్నారు.

ఇక మరోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గురు శిష్యు దర్శకులు బుచ్చి బాబు సానా, సుకుమార్ లతో వరుసగా 16, 17 సినిమాలు చేయనున్నాడు. ఇవి కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ప్లాన్ చేస్తున్నారు. మొదటగా బుచ్చిబాబు సినిమా ఈ ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ సినిమా మేకోవర్ కి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేసి వచ్చే ఏడాది లోనే రిలీజ్ కి చేయనున్నారు.

Tags

Next Story