Kangana Ranaut : డబ్బు కంటే కూడా నాకు గౌరవమే ముఖ్యం : కంగనా రనౌత్

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్నకుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ ఈవెంట్ మూడు రోజుల క్రితం జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులెందరో హాజరయ్యారు. వచ్చిన వాళ్లలో చాలా మంది స్టేజీ ఎక్కి చిందులు కూడా వేశారు.
ఆ వేడుకలను చూసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సెటైర్లు వేసింది. గతంలో గాయని లతా మంగేష్కర్ చేసిన కొన్ని వ్యాఖ్యలనూ కోట్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినప్పటికీ కూడా పెళ్లిళ్లలో పాటలు పాడేది లేదని లతా మంగేష్కర్ తేల్చి చెప్పారు. ఆ వ్యాఖ్యలను కంగనా గుర్తు చేస్తూ తాను కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆమె బాటలోనే పయనిస్తానని చెప్పింది.
అందుకే ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ పెళ్లిళ్లు, అవార్డుల వేడుకలలో ప్రదర్శనలు ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోలేదని చెప్పింది. కొన్ని సినిమాల్లో అత్యధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని ఐటెం సాంగ్స్ చేయాలని కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగానే ఉంటున్నట్టు చెప్పారు. తనకు డబ్బు కంటే కూడా గౌరవమే ముఖ్యమని తెలిపింది. అందుకే డబ్బులు కట్టలు కట్టలుగా తన వద్దకు వస్తున్నప్పటికీ నేను వద్దు అనుకుని తన పద్దతిలో, తన హద్దుల్లో తాను ఉంటున్నాని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com