Chandramukhi 2 : టీవీలో వస్తున్న కంగన 'చంద్రముఖి 2'

ఎన్నికల టైంలో కంగనా రనౌత్ నటించిన క్రేజీ సినిమా టీవీల్లో వస్తోంది. పి.వాసు దర్శకత్వంలో స్టార్ కొరియోగ్రాఫర్-నటుడు-దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన 'చంద్రముఖి 2' సినిమా సెప్టెంబర్ 28న తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రముఖి రేంజ్ లో కాకపోయినా మంచి వసూళ్లు సాధించింది.
ఈ సినిమా జెమినీ టీవీలో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా ఏప్రిల్ 28, 2023న సాయంత్రం 6 గంటలకి ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ హర్రర్-కామెడీ చిత్రంలో హిందీ నటి కంగనా రనౌత్ కథానాయికగా నటించి మెప్పించింది.
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించింది. వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్ మరియు ఇతరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి మ్యూజిక్ అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com