విజయ్, రవితేజ లతో కన్నడ బ్యూటీ రుక్మిణీ!

కన్నడ బ్యూటీలైన రష్మిక మందన్న (Rashmika Mandanna), పూజా హెగ్దేలు (Pooja Hedge) సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ మధ్య పూజా హెగ్దే వరుస ఫ్లాపులతో కాస్త డీలా పడినా.. రష్మిక మాత్రం హిట్లతో దూసుకెళ్తంది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా విడుదలైన యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు సౌత్ లో మరో కన్నడ బ్యూటీ వరుస సినిమా అవకాశాలు అందుకుంటుంది.
సప్త సాగరాలు దాటి సినిమాతో పాపులర్ అయిన రుక్మిణీ వసంత్ (Rukhmini Vasanth) .. టాలీవుడ్, కోలీవుడ్ లలో అవకాశాలు అందుకుంటోంది. ఈ బ్యూటీ నటించిన సైన్ఏ, సైడ్ రెండు భాగాలుగా వచ్చి టాలీవుడ్ లో మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లో రుక్మిణి నటనకి మంచి మార్కులే పడ్డాయి. దీంతో సౌత్ దర్శకనిర్మాతలు ఈ అమ్మడిని సంప్రదిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం తమిళ్ లో స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలో ఈ అమ్మడు. నటించనుంది.
స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న మూవీలో ఆమెనే హీరోయిన్ గా ఎంపికైంది. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఈమె పేరునే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రవితేజ మూవీలో రుక్మిణినే తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన లు వచ్చే అవకాశం ఉంది. దీంతో సౌత్ లో మరో కన్నడ బ్యూటీ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com