Kannappa Remuneration : కన్నప్పు వీళ్లిద్దరి రెమ్యూనరేషన్ జీరో!

Kannappa Remuneration : కన్నప్పు వీళ్లిద్దరి రెమ్యూనరేషన్ జీరో!
X

పాన్ ఇండియా స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ రెమ్యూనరేషన్ జీరో అయ్యింది. అంతే కాదండోయ్ మళయాల నటుడు మోహన్ లాల్ ది కూడా అదే పరిస్థితి. ఏమిటీ ఈ స్టార్ హీరోలు అసలు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదా..? అనే ప్రశ్న సహజం అయితే వీళ్లిద్దరూ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్న ప్ప సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వీళ్లిద్దరూ రూపాయి కూడా తీసుకోలేదని స్వయంగా మంచు విష్ణు వెల్లడించడం గమనార్హం. ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇండస్ట్రీలోని అగ్రనటీనటులు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రా జెక్ట్ కోసం పని చేస్తున్నట్లు వెల్లడించారు. సుమారు రూ.140 కోట్లతో ఈ మూవీ రూపుదిద్దకుంటోంది. మోహన్ లాల్ ఒక గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. డార్లింగ్ హీరో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని 'కన్నప్ప' చిత్రాన్ని రూపొంది స్తున్నారు.

Tags

Next Story