Kannappa : కన్నప్ప కౌంట్ డౌన్ స్టార్ట్

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'కన్నప్ప'. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ప్ర మోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించిన విష్ణు అమె రికాలో అక్కడ ప్రేక్షకుల మధ్య సినిమా ప్రచారం మొదలు పెట్టారు. ఇటీవల ఈ మూవీ నుంచి చివరి మూడో ఎపిసోడ్ యానిమేటెడ్ సిరీస్ ను సైతం విడుదల చేసిన మేకర్స్.. తాజాగా పరమ శివుడు పాత్రధారి అక్షయ్ కుమార్ పూర్తి లుక్ను రిలీజ్ చేశారు. ఇంకా 40 రోజులే ఉందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ముకేశ్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. ప్రీతి ముకుందన్ హీరోయిన్. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు కీలక పాత్రలో నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com