Keerthi Suresh : పెళ్లి కోసం కీర్తీ స్పెషల్ శారీ
బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మహానటి ఫేమ్ కీర్తీ సురేశ్. నేను శైలజ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. డిఫరెంట్ రోల్స్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించే కీర్తి.. దసరా సినిమాలో అద్భుతంగా నటించి అందరిని ఫిదా చేసింది.
ఇక మహేశ్ బాబు సరసన పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’లో కీర్తీ సురేశ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటి వరకు దక్షిణాదిలో కన్నడ మినహా అన్ని ఇండస్ట్రీలో నటించిన కీర్తి.. త్వరలో 'బేబీ జాన్' మూవీతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజయ్ హీరోగా నటించిన 'తేరీ' మూవీకి రీమేక్గా తెరకెక్కుతోంది.
అయితే రీసెంట్ గా డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కీర్తీ సురేశ్ హాజరైంది. ఆ పెళ్లి కోసమే ప్రత్యేకంగా ఓ శారీ డిజైన్ చేయించుకున్న ఈ బ్యూటీ.. దానికోసం తన రేంజ్ కు తగ్గట్లుగానే దాదాపు రూ. 3లక్షలు ఖర్చు చేసిందట. అయితే ఈ శారీలో కీర్తి మరింత అందంగా కనిపిస్తోందంటూ.. అభిమానులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com