Keerthi Suresh : కీర్తి సురేష్ సర్ ప్రైజ్.. సోషల్ మీడియాలో బజ్

Keerthi Suresh : కీర్తి సురేష్ సర్ ప్రైజ్.. సోషల్ మీడియాలో బజ్

సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే.. కీర్తి సురేశ్ పోస్ట్ కచ్చితంగా ఒక్కటైనా కనిపిస్తుంది. అంతలా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ పేజీలు పెరిగిపోయాయి. నిజానికి కీర్తిసురేశ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు.

పద్ధతిగా ఉండే ఫొటోలు పెట్టడం వల్లే చాలామందికి కీర్తిసురేష్ క్యూట్ నెస్ నచ్చుతుంది. కీర్తి సురేష్ మాత్రం ఆ విషయంలో చాలా డిఫరెంట్. చాలా పద్ధతిగా తన లిమిట్స్ లో తాను తన వర్క్ చేసుకొని ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా స్కిన్ షో కి దూరంగా ఉండే కీర్తి సురేష్ రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక కచ్చితంగా ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే అన్న కామెంట్స్ మనం ఎప్పటినుంచో వింటున్నాం. మరి కీర్తి సురేష్ స్కిన్ షో చేస్తుందా అన్నది సర్ ప్రైజింగ్ గా మారింది.

లేటెస్ట్ గా కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో.. ఆమె పెళ్లి వార్త వండి వార్చుతున్నారు నెటిజన్లు. చాలా ట్రెడిషనల్ గా రెడీ అయిన కీర్తి సురేష్ తన ఫోటోని షేర్ చేసింది. పెళ్లికి సిద్ధమైనప్పుడు సెల్ఫీ తప్పనిసరి అంటూ ఒక సెల్ఫీ ఫోటోను షేర్ చేసింది. ధగధగ మెరిసిపోయేలా నవ్వగల ఈ అమ్మడు నగల దుకాణాలా బ్రాండ్ అంబాసిడర్ అన్న సంగతి తెలిసిందే కదా.

Tags

Read MoreRead Less
Next Story