Keerthy Suresh : పాండ్స్ అంబాసిడర్ గా కీర్తి సురేశ్

Keerthy Suresh : పాండ్స్ అంబాసిడర్ గా కీర్తి సురేశ్
X

టాలీవుడ్ లోకి నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తీ సురేశ్. అనంతరం మహానటి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి జాతీయ అవార్డును అందుకుంది. అనంతరం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బేబీ జాన్ లో కీర్తీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మూవీతోనే కీర్తీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ తేరీ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా పాండ్స్ స్కిన్ ఇన్స్టిట్యూట్ అంబాసిడర్ కీర్తీ సురేశ్ నియామకమైంది. సౌత్ ఇండియాలో కీర్తీ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కీర్తీని బ్రాండ్ అంబాసిడర్ని నియమించడం ద్వారా సౌత్ లో తమ ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ పాండ్స్ తెలిపింది.

Tags

Next Story