Keerthy Suresh : సన్నబడి చాన్స్ కోల్పోయిన కీర్తీ సురేశ్

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అనంతరం హీరోయిన్ గా ఎదిగిన బ్యూటీ కీర్తి సురేశ్ (Keerthy Suresh). టాలీవుడ్ లోకి మాత్రం నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మహానటి మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది రిలీజైన దసరా సినిమాతోనూ కీర్తీ సురేశ్ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ బ్యూటీ పెద్దగా నటించడం లేదు. తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది. హిందీలోనూ అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం హిందీలో వరుణ్ దావన్ కి జోడీగా కీర్తి సురేష్ ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కంటే ముందే అజయ్ దేవగన్ తో కలిసి 'మైదాన్' సినిమాలో కీర్తి సురేష్ నటించాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో మేకర్స్ మనసు మార్చుకున్నారు. కీర్తి సురేశికి బదులుగా ప్రియమణిని ఎంచుకున్నారు. తాజాగా డైరెక్టర్ అమిత్ శర్మ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'మైదాన్ సినిమాలో అబ్దుల్ రహీమ్ పాత్రను అజయ్ దేవగన్ పోషిస్తున్నాడు.
ఇందులో ఆయన భార్య పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాం. అందుకే కీర్తి సురేష్ హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాం. ఆ సమయంలో కీర్తి సురేష్ చాలా బరువు తగ్గి సన్నగా మారింది. ఇక ఆ పాత్రకు ఆమె సెట్ కాలేదు. దీంతో ప్రియమణితో కలిసి ఈ సినిమా చేశాం' అని తెలిపాడు. మైదాన్ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com