Keerthy Suresh : గ్లామర్ షోకు రెడీ.. బాలీవుడ్ పై కన్నేసిన కీర్తీ

నేను శైలజ (Nenu Sailaja) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. కీర్తీ సురేశ్ (Keerthi Suresh). సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడటంతో అనంతరం వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. దీంతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తమిళ సినిమాల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ లో కీర్తీ నటించిన మహానటి మూవీ తన రేంజ్ నే మార్చేసింది. ఈ సినిమాలో కీర్తీ నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దసరా సినిమాతోనూ కీర్తీ మంచి హిట్ ను అందుకుంది. బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఈ బ్యూటీ ఎంట్రీ ఇస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా..మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్ గా విడుదలైన భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో ఆ సినిమా ఎఫెక్ట్ కీర్తిపై పడింది. టాలీవుడ్తో పాటు సౌత్లోనూ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు అందడం లేదు. దీంతో ఇక బాలీవుడ్ లోనే రాణించాలని కీర్తి యోచిస్తోంది. నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోంది. అయితే బాలీవుడ్ లో రాణిచాలంటే గ్లామర్ షో చేయాల్సిందే. మరి కీర్తి అందుకు సిద్దంగా ఉందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com