Rajadhani Rowdy Re-Release : తెలుగులో యష్ పాత సినిమా రీరిలీజ్

Rajadhani Rowdy Re-Release : తెలుగులో యష్ పాత సినిమా రీరిలీజ్

కేజీయఫ్ ఫేమ్ యశ్ హీరోగా, షీనా హీరోయిన్ గా నటించిన చిత్రం 'రాజధాని రౌడీ'. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత సంతోష్ కుమార్ నిర్మాణంలో అనువదిస్తున్నారు. కె.వి.రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. జూన్ 14న విడుదల చేస్తున్నారు.

మాదకద్రవ్యాలు, మద్యపానం బారినపడి, నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కధాంశంతో తెరకెక్కిన చిత్రం రాజధాని రౌడీ అని నిర్మాత సంతోష్ కుమార్ చెప్పారు. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందిన చిత్రమిది.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీస్ గా నటించారు. ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం అందించారు. గతంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో మంచి బిజినెస్ చేస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story