Kiara Advani : క్రేజీ ప్రాజెక్టులో కియారా .. యశ్ కు జోడీగా
![Kiara Advani : క్రేజీ ప్రాజెక్టులో కియారా .. యశ్ కు జోడీగా Kiara Advani : క్రేజీ ప్రాజెక్టులో కియారా .. యశ్ కు జోడీగా](https://www.tv5news.in/h-upload/2024/03/23/1220372-kiara-advani-and-yash.webp)
భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani). అంతకు ముందు ఎంఎస్ ధోనీ సినిమాతో ఈ అమ్మడు మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో వినయ విధేయ రామ మూవీలోనూ కియారా నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా గేమ్ చేంజర్ లో నటిస్తోంది. ఓ పక్క బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరో పక్క సౌత్ లోనూ అవకాశాలు అందుకుంటోంది.
రీసెంట్ గా మరో సౌత్ సినిమాకు కియారా ఓకే చెప్పినట్లు సమాచారం. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కి జోడీగా నటించేందుకు ఈ బ్యూటీ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. యశ్ కొత్త సినిమా 'టాక్సిక్' లో హీరోయిన్ గా చేసేందుకు ఆమెతో మూవీ టీం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
మొదట్లో టాక్సిక్ లో కరీనా కపూర్ నటిస్తుందనే వార్తలు వెలువడ్డాయి కానీ.. అవన్నీ పుకార్లే అన్నట్లుగా అనిపిస్తోంది. దీనిపై మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పెళ్లి తర్వాత కూడా కియారాకు హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రను కియారా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com