Kollywood : పెళ్లి చేసుకున్న కోలీవుడ్ హీరో, హీరోయిన్
నటుడు అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, కోలీవుడ్ హీరో ఉమాపతి వివాహబంధంతో ఒక్కటయ్యారు. చెన్నైలో ఇవాళ వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత గతేడాది అక్టోబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏడడుగులు నడిచారు.
అర్జున్ ఇద్దరు కుమార్తెల్లో ఐశ్వర్య పెద్దమ్మాయి. ఐశ్వర్య అర్జున్ 2013లో నటిగా అరంగేట్రం చేసింది. తన కుమార్తెను నటిగా నిలబెట్టేందుకు ఈ సీనియర్ హీరో ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తానే డైరెక్టర్‌గా మారి కుమార్తెను హీరోయిన్గా పెట్టి సినిమా తీసినా అది హిట్టవ్వలేదు. ఇక ఉమాపతి తమిళ హాస్యనటుడు తంబి రామయ్య కుమారుడు. 2017లో అడగపట్టదు మగజనంగాలేతో అరంగేట్రం చేశాడు. అర్జున్ సర్జా హోస్ట్ చేసిన అడ్వెంచర్ ఆధారిత రియాలిటీ షో సర్వైవర్‌లో కనిపించాడు.
60 ఏళ్లు దాటిన అర్జున్ కు ఈ మధ్య కాలంలో హీరోగా నటించే అవకాశాలు లేకపోయినా తన వయసుకు తగ్గట్టుగా బలమైన పాత్రలు, విలన్ పాత్రలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అలానే అర్జున్ మూడేళ్ల క్రితం సర్వైవర్ అనే షోని హోస్ట్ చేసి స్మాల్ స్క్రీన్‌పై ఫేమస్ అయ్యాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com