TS : దాసరి అవార్డ్స్ సందర్భంగా కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

దాసరిగారి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. "దాసరి నారాయణరావుగారి సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లం. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా ఆయన చేయని విభాగం లేదు. పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరుకున్న దాసరిగారి పేరు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకూ చిరస్థాయిగా ఉంటుందను కుంటున్నాను" అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు 77వ జయంతి. వేడుకలు 'దర్శకరత్న డి.ఎన్. ఆర్. ఫిల్మ్ అవార్డ్స్' కమిటీ కన్వీనర్ బీఎస్ఎన్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా "దర్శకరత్న డి.ఎన్. ఆర్.పిల్మ్ అవార్డ్స్' పేరిట తెలుగు సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు అందించారు.
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. "దాసరిగారి గురించి చిన్నప్పటి నుంచి వింటూ.. ఈ రోజు 77వ జయంతి వేడుకల్లో పాల్గొనడం, ఆయన్ని స్మరించుకోవడం సంతోషంగా ఉంది, ఇండస్ట్రీకి ఎంతో మేలు చేసిన ఆయన తక్కువ వయసులోనే అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం" అన్నారు.
"దర్శకరత్న డి.ఎన్.ఆర్.ఫిల్మ్ అవార్డ్స్' జ్యూరీ కమిటీ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. దాసరిగారు కెరీర్ ప్రారంభంలో చెప్పుల్లేకుండా చెన్నై వచ్చారని విన్నాను. అలాంటి ఆయన రాఘవగారి ఆఫీసులో ఉంటూ చిన్న ఉద్యోగం చేస్తూ తర్వాత ఏ స్థాయికి ఎదిగారో మనమం ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారన్నది మనం చూడాలి. ఆయన్ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనకు వంద మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచంలో ఎవరికీ అంతమంది శిష్యులు లేరు" అన్ని తమ్మారెడ్డి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com