Rashmika Mandanna : రష్మిక డీప్ ఫేక్ వీడియో.. లేటెస్ట్ అప్ డేట్

సౌత్ నుంచి నార్త్ కు వెళ్లి దుమ్ములేపుతున్న కన్నడ అందం రష్మిక మందన్నా (Rashmika Mandanna). సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించున్న రష్మిక మందన్నా.. సినిమాలతో.. కాంట్రవర్సీలతో.. హక్కుల పోరాటాలతో వార్తల్లో నిలుస్తోంది. నేషనల్ క్రష్ గా మారిన రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు బయటపడుతున్నాయి.
రీసెంట్ గా కొన్ని డీప్ ఫేక్ వీడియోస్ బయటకొచ్చాయి. వీటిపై లీగల్ గా ఫైట్ చేసి సపోర్ట్ సంపాదించింది రష్మిక. లేటెస్ట్ గా మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వేరే అమ్మడి బాడీకి రష్మిక ఫేస్ ను ఏఐతో మార్చిన వీడియో అది. అందాలన్నీ ఒలకబోస్తున్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
రష్మిక ఔట్ అండ్ ఔట్ అందాలన్నీ కనిపిస్తుంటాయి ఆ వీడియోలో రష్మిక దృష్టిలో పడిందని.. ఆందోళన వ్యక్తంచేసినట్టు సమాచారం. ఏఐ టెక్నాలజీని ఇష్టమొచ్చినట్టుగా వాడుతున్నారని.. ముఖ్యంగా మహిళలకు ప్రైవసీ లేకుండా పోయిందని ఆమె మనోవేదనకు లోనవుతున్నారట. దీనిపై చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని రష్మిక భావిస్తున్నారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com