Raj Tharun : లావణ్య ట్విస్ట్.. హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

Raj Tharun : లావణ్య ట్విస్ట్.. హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు

హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై సెక్షన్ 420, 506, 493 కింద కేసు నమోదు చేశారు. నటుడు రాజ్ తరుణ్ తనకు పదేళ్ల క్రితమే వివాహమైందని, పదేళ్లుగా తాము కలిసి కాపురం చేస్తున్నామని లావణ్య ఫిర్యాదులో తెలిపింది.

కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను లావణ్య పోలీసులకు అందజేసింది. అలాగే తామిద్దరం కలిసి విదేశాలకు కూడా వెళ్లామని ఆ సమయంలో తన పేరును అన్వికాగా మార్చాడని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోను లావణ్య తన అబార్షన్ కు సంబంధించిన టెక్నికల్ ఆదారాలు, అలాగే మెడికల్ డాక్యుమెంట్లతో పాటు 170 ఫొటోలను పోలీసులకు అప్పగించింది.

నార్సింగి పోలీసులు రాజ్ తరుణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ చేపట్టారు.

Tags

Next Story