Raj Tharun : హీరో రాజ్ తరుణ్, మాల్వి పెళ్లి నిజమే.. లావణ్య తాజా ఆరోపణ

హీరో రాజ్ తరుణ్ ( Raj Tharun ) తనకు వివాహమైందని, ఫోన్లో ఉన్న ఫోటోలను ఆయనే డిలీట్ చేశాడని లావణ్య ( Lavanya ) మరోసారి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేసింది. రాజ్ తరుణ్ 14 ఏళ్లుగా పరిచయం ఉందని, 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నామని తెలిపింది. ఇటీవల మాల్వీ మల్హోత్రా ( Malvi Malhotra ) వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడని, వాళ్లిద్దరు. కలిసి ఉంటున్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
రాజ్ తరుణ్ తాను గుడిలో పెళ్లి చేసుకున్నామని, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నందుకే. అతనిపై ఫిర్యాదు చేశానని తెలిపింది. నాతో ఎవరు మాట్లాడినా అతడితో రిలేషన్ లో ఉన్నట్లేనా ? తన వద్ద రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని వివరించింది. తనకు డబ్బులు కోసం బెదిరించాల్సిన అవసరం లేదని రాజ్ తరుణ్ లైఫ్లోకి తాను హీరో అయ్యాకా రాలేదని లావణ్య తెలిపింది. మస్తాన్ సాయికి నాకు ఎలాంటి సంబంధం లేదని, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే. నన్ను వదిలించుకోవాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
రాజ్ తరుణ్ లేకుండా తాను బతకలేనని, ముసలిదాన్ని అయిన కూడా అతనే నా మనసులో ఉంటాడని లావణ్య వివరిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com