Laxmi Rai : బికినీలో లక్ష్మీరాయ్.. మాములుగా లేదుగా

Laxmi Rai : బికినీలో లక్ష్మీరాయ్.. మాములుగా లేదుగా
X

'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భామ లక్ష్మీరాయ్ ( Laxmi Rai ). ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన నటించిందీ ముద్దుగుమ్మ . తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తరువాత, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన “కాంచన” సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో, ఆమె దక్షిణ భారత సినీ పరిశ్రమలో బిజీబిజీగా మెరిసిపోయింది. సౌత్లోని పెద్ద సినిమాల్లో తనకంటూ మంచి గుర్తింపు పొందలేకపోయినా, ఐటెం సాంగ్స్ అదరగొట్టింది. “రత్తాలు" అనే పాట ద్వారా ఫేమ్ అయ్యింది. లక్ష్మీ రాయ్ సినిమా కెరీరికి వచ్చిన విపరీతమైన క్రేజ్తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. అయితే బాలీవుడ్లో కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసినా, అక్కడ కూడా ఆశించిన స్థాయి గుర్తింపు అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ అమ్మడికి ఇన్స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా మరోసారి డిఫరెంట్ బికినీలో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోతో మరింత ట్రెండింగ్ అవుతోంది. పూల్ పక్కన తీసిన ఈ ఫోటోలో, ఆమె స్టైలిష్ గాగుల్స్ తో తన అందాన్ని మరింత హైలెట్ చేయడం విశేషం. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది.

Tags

Next Story