Meenakshi Chaudhary : పొడుగు కాళ్ల అందం మీనాక్షి చౌదరి వెంకీతో జోడీ

X
By - Manikanta |29 Jun 2024 4:09 PM IST
తెలుగు సినిమా అగ్ర దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. స్టార్ డైరెక్టర్ ఇప్పటి వరకు తన కెరీర్ లో హిట్లను మాత్రమే కలిగి ఉన్నాడు. తాజాగా ఇప్పుడు దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను కొన్ని నెలల క్రితమే ప్రకటించారు.
చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరి ( Meenkashi Chaudary ) కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుందని ఆమె కోసం వేట సాగుతుందని కూడా వార్తలు వస్తున్నాయి. దిల్రాజు ఈ చిత్రాన్డ్రి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com