Mahesh Babu : హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా : మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తుచేసుకుంటూ తనయుడు మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఫొటోను పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో మీరెప్పటికీ జీవించి ఉంటారు’ అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో కృష్ణను చూస్తుంటే మహేశ్‌లానే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022 నవంబర్ 15న కృష్ణ తుదిశ్వాస విడిచారు.
తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా చరిత్రలో ఈ నటశేఖరుడి ప్రస్థానం అద్భుతమైనది. తెలుగు సినిమాకు ఎన్నో సొబగులు అద్దిన, అందించిన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరూ నటశేఖరుడిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ.. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com