మహరాజాతో పాటు.. మరో టైటిల్ లాక్ చేసిన మహేశ్- రాజమౌళి!

మహరాజాతో పాటు.. మరో టైటిల్ లాక్ చేసిన మహేశ్- రాజమౌళి!

మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి మూవీ ప్రి ప్రొడక్షన్ కంప్లీషన్ లో ఉంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మంట్ రానుంది. ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా టైటిల్ ఇదే అంటూ వార్తలు వస్తున్నాయి. రెండు టైటిల్స్ కూడా లాక్ చేసినట్టు సమాచారం.

అందరి అంచనాలకు మించి రాజమౌళి ఈ సినిమా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని ఇప్పటికే బయటకొచ్చిన కాన్ఫిడెన్షియల్ సోర్స్ తో తెలిసిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారు అనే దానిపైన ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.

మహారాజా లేదా చక్రవర్తి అనే టైటిల్స్ ను మహేశ్, రాజమౌళి మూవీకోసం లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఏ టైటిల్ పెట్టినా ప్యాన్ ఇండియా గా ఉండేట్టు చూస్తున్నారట. అన్ని భాషలకు సెట్ అయ్యేలా ఉంటుందన్న కారణంతో .. ఈ రెండిటిలో ఎదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నారని సమాచారం. మహేశ్ బాబు గుంటూరు కారం థియేటర్ కంటే ఓటీటీలో మంచి టాక్ తో ట్రెండింగ్ లో ఉంది. మూవీ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ టాప్ టెన్ లో స్ట్రీమ్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story