Malavika Mohanan : నాకు దయ్యాలంటే భయమంటున్న మాళవిక

Malavika Mohanan : నాకు దయ్యాలంటే భయమంటున్న మాళవిక
X

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో చిట్ చాట్ నిర్వహించే హీ రోయిన్స్ లలో మాళవికా మోహనన్ ఒకరు. రెండు సినిమాల షూటింగ్ పూర్తి చేసిన ఆమె తాజాగా ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ను పలకరించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. ది రాజాసాబ్ మూవీలో రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఓ మాస్ సాంగ్ ఉంటుందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. దర్శకుడు రాజమౌళితో వర్క్ చేయాలని ఉన్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఇక వేరే రంగం ఎంచుకోవాల్సి వస్తే దేన్ని ఇష్టపడతారు అన్న ప్రశ్నకు.. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అని బదులి చ్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని నటి మా ళవికను పెళ్లి గురించి అడిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సరదాగా ప్రశ్నించాడు. ఆమె కూడా ఏమాత్రం కంగారు పడకుండా సమాధానం చెప్పింది. తనకు దెయ్యాలంటే భయమని రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఆమె దయ్యాల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చిందంటే ప్రశ్న అడిగిన యూసర్ ఎక్స్ ఖాతా పేరు 'ఘోస్ట్' అని ఉంది. దీంతో ఆ విధమైన సమాధానం నవ్వుతూనే చెప్పింది మాళవిక.

Tags

Next Story