Malavika Mohanan : మాళవిక స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు వైరల్

పట్టంపోల్ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి మాళవిక మోహనన్. ప్రస్తుతం డార్లింగ్ హీరో ప్రభాస్ సరసన రాజాసాబ్ సినిమాలో బిజీగా ఉందీ అమ్మడు. ప్రఖ్యాత చిత్రనిర్మాత మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హరర్, కామెడీ జోనర్ లో వస్తోంది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ తోపాటు, నిధి అగర్వాల్ కూడా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సినిమాల్లో నటించడంతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోందీ భామ.
ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. అందమైన జలపాతం వద్ద ఎర్రటి చీరలో హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చిందీ భామ. ఈ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. వీటిని చూసిన నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఇక రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com