Accident : హీరోయిన్‌కు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స

Accident : హీరోయిన్‌కు యాక్సిడెంట్.. ఐసీయూలో చికిత్స

మలయాళ హీరోయిన్ అరుంధతి నాయర్ (Arunthathi Nair) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం సోదరుడితో పాటు స్కూటీపై ఆమె ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆమె తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అరుంధతి వైద్యానికి సహాయం కోరుతూ ఆమె తోటి నటి గోపిక అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

రోడ్డు ప్రమాదానికి గురైన అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు ఐసీయూలో చికిత్స జరుగుతుంది. వైద్యానికి భారీగా ఖర్చు అవుతుంది. మేము చేయగలిగిన సహాయం చేస్తున్నాము. అయినప్పటికీ వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదు. మీ వంతు ఆర్థిక సహాయం చేయండి. మీ సహాయం అరుంధతికి మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుంది... అని ఆమె రాసుకొచ్చారు.

కాగా 'పొంగి ఎలు మనోహర(2014)' సినిమాతో నటిగా వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టిందీ అరుంధతి. విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒట్టకోరు కాముకన్‌ చిత్రంతో మలయాళ చిత్రసీమకు పరిచయమైంది. పద్మిని, డోంట్‌ థింక్‌ అనే వెబ్‌ సిరీస్‌ల్లోనూ యాక్ట్‌ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story