Mamitha Baiju : ఐటమ్ సాంగ్ కు మమితా రెడీ

బ్లాక్బస్టర్ మూవీ ' ప్రేమలు' బ్యూటీ మమితా బైజు ( Mamitha Baiju ) గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ యూత్ డ్రీమ్ గర్ల్ మారిపోయింది. ప్రేమలు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎవరి నోట విన్నా, ఈమె పేరే వినిపిస్తోందట. దీంతో టాలీవుడ్లో అగ్రహీరోల సరసన నటించే అవకాశం కూడా వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో మమితా నటించబోతుం డగా, విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. నిన్న కాక మొన్ననే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది అప్పుడే ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ ఒప్పుకుందట. ఈసాంగ్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ ముట్టిందని టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి. అలాగే ఈ అమ్మడు మలయాళీ సూపర్ స్టార్ హీరోకొడుకు సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి ఓకే చెప్పినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ము ద్దుగుమ్మపై అభిమానులుఫైర్ అవుతున్నారు. ఇంత త్వరగా ఐటమ్ సాంగ్ చేయడం ఏంటీఅంటూ అసహనంవ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com