Manam Movie Re-Release : మే 23న మళ్లీ మనం మూవీ రీరిలీజ్

Manam Movie Re-Release : మే 23న మళ్లీ మనం మూవీ రీరిలీజ్
X

అక్కినేని మూడు తరాల నటులు కలిసి నటించిన సినిమా మనం థియేటర్లలో మరోసారి సందడి చేయనుంది. డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా 2014 మే 23న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.ఇది నాగేశ్వరరావు చివరి సినిమా. ఇందులో నాగేర్వరరావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సమంత కీలకపాత్రలు పోషించారు. అఖిల్, అమల అతిథి పాత్రలు పోషించారు.

ఇంకో 5 రోజులు గడిస్తే ఈ సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మనం సినిమాను మే 23న రీరిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలని ప్రదర్శించబోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌‌లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు.

Tags

Next Story