Tollywood Movie : మనమే..! సింపుల్ అండ్ క్లాసీగా శర్వానంద్ కొత్త సినిమా

సింపుల్ హీరో శర్వానంద్ (Sharwanand) నటన ఇష్టపడని వారుండరు. సెటిల్డ్ ఎమోషన్స్... సెటిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ ఫిక్సయింది. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది.
శర్వానంద్-శ్రీరామ్ ఆదిత్య సినిమాకు 'మనమే' (Maname) అనే టైటిల్ ఖరారు చేశారు. సన్నజాజి తీగ కృతిశెట్టి కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ప్రకటించడంతో పాటు, స్పెషల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
మనమే మూవీ గ్లింప్స్.. ఓ రంగుల ఇంద్రధనుస్సులాగా కనిపిస్తోంది. టైటిల్ కి తగ్గట్టుగా, నేపథ్య సంగీతం, కలర్ కాంబినేషన్ అంతా క్లాసీగా కనిపిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగేళ్ల ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథ ఇది. మెలోడీ స్పెషలిస్ట్ అబ్దుల్ హేషమ్ వాహబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గ్లింప్స్ లో అతడి మ్యూజిక్ ఫీల్ గుడ్ లా సాగిపోతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com