Manchu Vishnu : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మంచు ఫ్యామిలీ సందడి

Manchu Vishnu : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మంచు ఫ్యామిలీ సందడి
X

మంచు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మీద కొన్ని సీన్లను చిత్రీకరించారు. ప్రభాస్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ప్రమోషన్ లో భాగంగా కేన్స్ ఫెస్టివల్ లో కన్నప్ప టీం సందడి చేసింది. మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా వంటి వారు కన్నప్ప కోసం కేన్స్ ఫెస్టివల్ కు వెళ్లారు. అక్కడే కన్నప్ప టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూసినవాళ్లంతా వావ్ అన్నారని టాక్.

తెలుగులో మే 30న కన్నప్ప టీజర్ రిలీజ్ కానుంది. మిగతా భాషల్లో జూన్ 13న కన్నప్ప టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు, అక్కడికి వచ్చిన ఇండియన్స్ కన్నప్ప టీజర్ చూసి ముగ్ధులయ్యారంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో తెలిపారు.

Tags

Next Story