Manisha Koirala : స్టార్ అవ్వాలంటే బికినీ వేసుకోవాలన్నాడు: మనీషా

తన కెరీర్ ఆరంభంలో ఓ ఫొటోగ్రాఫర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి మనీషా కొయిరాలా ( Manisha Koirala ) ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఓసారి ఫొటోషూట్‌కు వెళ్లాను. అక్కడ ఉన్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ నా దగ్గరకు టూ పీస్ బికినీ తెచ్చి వేసుకోమన్నాడు. అది ధరిస్తేనే స్టార్ అవుతానన్నాడు. ఇవి ఈత కొట్టే సమయంలో తప్ప సినిమాల్లో ధరించనని తేల్చిచెప్పాను. తర్వాత నేను పెద్ద నటిని అయ్యాక అతడే నా ఫొటోలు తీశాడు’ అని తెలిపారు. ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా. 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో కనిపించింది. కాగా.. మనీషా మొదట నేపాలీ చిత్రం ఫెరి భేతౌలాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ధన్వన్ , 1942: ఎ లవ్ స్టోరీ, బాంబే , అగ్ని సాక్షి , గుప్త, ది హిడెన్ ట్రూత్, దిల్ సే లాంటి చిత్రాలలో నటించింది. అయితే కొన్నేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న మనీషా లస్ట్ స్టోరీస్ (2018)తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన షెహజాదా (2023) చిత్రంలో కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com